హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడప ఐకాన్‌గా 'ఇన్వెస్ట్ కడప' కేంద్రం

కడపను పారిశ్రామిక, వాణిజ్య, ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా అభివృద్ధి చేస్తామని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం 'ఇన్వెస్ట్ కడప' కేంద్రాన్ని ప్రారంభించారు. పెట్టుబడిదారులకు భూమి, అనుమతులు, మౌలిక వసతులు, శాఖల సమన్వయంపై ఒకే వేదికగా సేవలు అందిస్తామన్నారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు దృష్టి సారిస్తామని చెప్పుకొచ్చారు.