హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

షెడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

AKP: కోటవురట్ల మండలానికి 72 పశువుల షెడ్లు మంజూరైనట్లు ఏపీవో నాగరాజు బుధవారం తెలిపారు. ఇందులో భాగంగా పాములవాక, అన్నవరం, బీకె పల్లి, రాజపేట గ్రామాల్లో నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. ఒక్కొక్క షెడ్డుకు రూ. 1.15 నుంచి రూ. 2 లక్షల కేటాయిస్తున్నట్లు తెలిపారు. పశు సంవర్థక శాఖ సహకారంతో వీబీ జీ రామ్ జీ పథకం కింద వీటిని నిర్మిస్తున్నామన్నారు.