హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రొయ్యల మేత ధరలు.. హైకోర్టు కీలక ఆదేశం

W.G: సర్క్యులర్ రేట్లకే రొయ్యల మేతను విక్రయించాలని తయారీదారుల సంఘాన్ని AP హైకోర్టు ఆదేశించింది. మేత రేట్ల పెంపును సవాల్ చేస్తూ.. W.G జిల్లా ఆక్వా రైతులు మల్లా తులసీరామ్, వెరవల్లి చంద్రశేఖర్ వేసిన పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వనామీ మేత టన్నుకు రూ.9 వేలు, టైగర్ మేతకు రూ.12 వేల పెంపుపై స్టే విధించి, విచారణను సెప్టెంబరు 30కి వాయిదా వేసింది.