VZM: కొత్తవలస సచివాలయం-2 వద్ద ఎన్టీఆర్ భరోసా 2026 నూతన పింఛన్ల దరఖాస్తుల స్వీకరణలో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధవారం కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బారులు తీరారు. అయితే, సర్వర్ మొరాయించడంతో ప్రక్రియ ఆలస్యం కావడంతో లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.


