హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధరల పెంపుపై సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా

W.G: నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ తణుకు పట్టణ సమితి ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ డీ.అశోక్ వర్మకు అందజేశారు. సీపీఐ తణుకు పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, ఏరియా కార్యదర్శి సికిలే పుష్పకుమారి కార్యక్రమానికి ఆధ్వర్యం వహించారు.