కృష్ణా: మచిలీపట్నంలోని పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంక్‌లో వాహనదారుల సౌకర్యార్థం అదనపు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. SP వీ. విద్యాసాగర్ నాయుడు వీల్ అలైన్‌మెంట్, చిన్నపాటి మరమ్మతులు, సర్వీసింగ్ తదితర సేవలను బుధవారం ప్రారంభించారు. సరసమైన ధరలకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యమని ఎస్పీ తెలిపారు. వాహనదారులు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పెట్రోల్ బంక్‌లో అదనపు వాహన సేవలు


