NTR: నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై విజయవాడ పంజా సెంటర్‌లో సీపీఐ నిరసన చేపట్టింది. పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య అన్నారు. వంట నూనె, ఉల్లి ధరలు భారీగా పెరిగాయని తెలిపారు. ధరలను వెంటనే తగ్గించాలని, లేకపోతే ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాలను హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'ధరలు తగ్గించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తాం'


