హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లక్ష్మీ నరసింహ కళ్యాణ మండపం ప్రారంభం

NTR: మైలవరంలో రూ.4 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన శ్రీ లక్ష్మీ నరసింహ కళ్యాణ మండపాన్ని బుధవారం ఘనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో ఏపీ రాష్ట్ర దేవదాయ, ధర్మదాయ శాఖామాత్యులు ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పాల్గొన్నారు. గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది.