హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యం: వైసీపీ

ప్రకాశం: మార్కాపురం వైసీపీ కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పిలుపునిచ్చారు. అధికార పార్టీ దౌర్జన్యాలకు కార్యకర్తలు భయపడొద్దని, వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి పాల్గొన్నారు.