హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగాల కోసం ముంపు బాధితుల వినతి

NDL:  శ్రీశైలం నిర్వాసితులకు జీవో.98 ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని శ్రీశైలం నీటి ముంపు నిర్వాసిత నిరుద్యోగుల సంఘం అధ్యక్షులు జయన్న డిమాండ్ చేశారు. ఈ విషయమై బుధవారం పాముల పాడు మండల తాహసీల్దారు‌కు వినతిపత్రం సమర్పించారు. 40 ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూసి 32 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.