హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గర్భిణులు, పిల్లలకు టీకాలు తప్పనిసరి'

W.G: యూనివర్సల్ ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగంగా పెనుమంట్ర 2 PHC పరిధిలో బుధవారం గర్భిణులు, చంటిపిల్లలకు రోగనిరోధక టీకాలు వేశారు. ఈ సందర్భంగా ANM శ్రీలక్ష్మి మాట్లాడారు. గర్భిణులు, పిల్లలకు వ్యాక్సిన్లు వేయించడంలో ఎలాంటి అలసత్వం చూపకుండా క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచించారు. అంగన్వాడీ టీచర్ విజయమ్మ, HA కృష్ణ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.