హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గిరిజన సమస్యల పరిష్కారమే లక్ష్యం'

ATP: రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ సొల్ల బొజ్జిరెడ్డి అనంతపురం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే కమిషన్ ముఖ్య లక్ష్యమని తెలిపారు. తాగునీరు, రోడ్లు, భూ వివాదాలు, ఆశ్రమ పాఠశాలల్లో వసతులపై వచ్చిన అర్జీలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.