హైదరాబాద్: 28°C
వార్తలు

చంద్రబాబుపై కేసులన్నీ కొట్టేశారు: సంధ్యారాణి

AP: చంద్రబాబుపై నమోదు చేసిన అక్రమ కేసులన్నింటినీ న్యాయస్థానాలు కొట్టివేశాయని మంత్రి సంధ్యారాణి తెలిపారు. నాడు చంద్రబాబుకు మద్దతుగా తెలుగు ప్రజలంతా స్వచ్ఛందంగా బయటకు వచ్చి పోరాడారని గుర్తు చేశారు. ఆయనకు జరిగిన అన్యాయంపై ప్రజలు పెద్దఎత్తున స్పందించారని పేర్కొన్నారు. చంద్రబాబుకు అండగా నిలిచిన తెలుగు ప్రజల పోరాటం చారిత్రాత్మకమని మంత్రి కొనియాడారు.