హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలకు శ్రమించండి: కలెక్టర్

VKB: జిల్లాలోని శివారెడ్డిపేట మైనార్టీ గురుకుల పాఠశాల, రామయ్యగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కలెక్టర్ దీపక్ తీవారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత లక్ష్యాల సాధనకు నిరంతరం శ్రమించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూర్, తదితరులు పాల్గొన్నారు.