హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ ఉత్సవాల నిర్వహణపై నేడు సమావేశం

KMR: నిజాంసాగర్ పోలీస్‌స్టేషన్‌లో గణేష్ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం నిర్వహించనున్నట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామ పెద్దలు, గణేష్ ఉత్సవాల నిర్వహణ కమిటీ సభ్యులు తప్పక హాజరు కావాలని కోరారు. ఈ సమావేశంలో ఉత్సవాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై చర్చించనున్నారని తెలిపారు.