రష్యా అధికారుల అదుపులో ఉన్న కాన్పూర్‌కు(UP) చెందిన ఇంజినీర్ చందన్ గుప్తా విడుదలయ్యారు. ఆయన క్షేమంగా ఇంటికి చేరుకున్నట్లు భార్య స్నేహ వెల్లడించారు. భర్తను రష్యా ఆర్మీలో బలవంతంగా చేర్చుకుంటారేమోనని ఆందోళన చెందిన ఆమె.. ఆయన్ను కాపాడాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. భారత ఎంబసీ, కంపెనీ యాజమాన్యం చొరవతో ఎట్టకేలకు ఆయన క్షేమంగా బయటపడ్డారు.
వార్తలు
రష్యాలో క్షేమంగా బయటపడ్డ భారత ఇంజినీర్


