హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీ మాజీ సీఎస్‌ రాకేష్‌ మెహతా సూసైడ్

ఢిల్లీ మాజీ సీఎస్‌ రాకేష్‌ మెహతా నోయిడాలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనాస్థలంలో సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీర్ఘకాలిక అనారోగ్యం, మానసిక ఒత్తిడి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నోట్‌లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. 2007 నుంచి 2010 వరకు ఢిల్లీ CSగా పనిచేసిన ఆయన, కీలక మౌలిక వసతుల అభివృద్ధిలో పాల్గొన్నారు.