ప్రకాశం: అద్దంకిలోని నేషనల్ హైవేపై మంగళవారం అర్ధరాత్రి సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని లారీ ఢీకొట్టడంతో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108లో అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జరిగిన ప్రమాదంపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డ వ్యక్తికి ఒక కాలు పూర్తిగా దెబ్బతిన్నట్లుగా వైద్యులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
లారీ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు


