ప్రకాశం: సింగరాయకొండలోని జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదం నుంచి డ్రైవర్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు. రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న వాహనం గురించి తెలుసుకున్న హైవే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. మరో ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
లారీ బోల్తా.. డ్రైవర్‌కు గాయాలు


