హైదరాబాద్: 28°C
తెలంగాణ

దశాబ్దంగా అసంపూర్తిగానే అదనపు తరగతి గది

MBNR: బాలానగర్ మండలం గంగాధర్‌పల్లిలోని ప్రాథమికోన్నత పాఠశాలలో అదనపు తరగతి గది నిర్మాణం దశాబ్దంగా అసంపూర్తిగా ఉంది. స్లాబ్ వరకు నిర్మించి గుత్తేదారు పనులు నిలిపివేశారు. తరగతి గదుల కొరతతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. నిర్మాణాన్ని పూర్తి చేసి విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.