హైదరాబాద్: 28°C
తెలంగాణ

SC నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు చర్యలు

ఆసిఫాబాద్ జిల్లాలోని SC నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ హరిత అన్నారు. కలెక్టరేట్‌లో 2025- 26 షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు స్వయం ఉపాధి పథకం కింద ఆర్థిక పురోగతిపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. స్వయం ఉపాధి పథకం కింద మంజూరైన యూనిట్లను అర్హులకు అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.