హైదరాబాద్: 28°C
తెలంగాణ

తుమ్మిళ్లలో జోరుగా మట్టి దందా

GDWL: రాజోలి మండలం తుమ్మిళ్లలో మట్టి దందా జోరుగా సాగుతోంది. ఎత్తిపోతల పథకం పనుల సమయంలో డంపులుగా పేరుకుపోయిన మట్టిని అధికారుల అనుమతితోనే తరలించాల్సి ఉండగా, ఎలాంటి అనుమతులు లేకుండానే తరలిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ మట్టి తరలింపుపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.