హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐదు తరగతులు.. ఒక్కరే ఉపాధ్యాయులు

SRD: కంది మండలం చిద్రుప్ప ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 తరగతులు కొనసాగుతున్నాయి. రెండు గదుల్లో విద్యార్థులకు బోధన జరుగుతోంది. పాఠశాలలో నలుగురు ఉపాధ్యాయులు ఉండగా, ఇద్దరు డిప్యుటేషన్‌పై, మరొకరు సెలవులో ఉన్నారు. దీంతో ఒక్క ఉపాధ్యాయురాలే రెండు గదుల మధ్య తిరుగుతూ అన్ని తరగతులకు పాఠాలు బోధించాల్సిన పరిస్థితి నెలకొంది.