హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేరేచర్ల జంక్షన్‌లో ప్రయాణికుల అవస్థలు!

GNTR: గుంటూరు, నరసరావుపేట, సత్తెనపల్లి మార్గాల్లో నిత్యం రద్దీగా ఉండే పేరేచర్ల ప్రధాన కూడలిలో బస్‌షెల్టర్లు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీస నీడ సదుపాయం లేకపోవడంతో ఎండ, వానల్లో రోడ్డుపైనే వేచి చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి బస్‌షెల్టర్ నిర్మించాలని కోరుతున్నారు.