హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్పంచ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

WGL: కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు ఇస్లావత్ సావిత్రిని కులం పేరుతో దూషించారనే ఫిర్యాదుతో మంగళవారం పర్వతగిరి మండలం ఏనుగల్లు సర్పంచి తొర్రి పద్మపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పార్టీ కార్యక్రమానికి గ్రామానికి వెళ్లిన సమయంలో సర్పంచ్, ఆమె అనుచరులు గొడవకు దిగి దూషించారని సావిత్రి ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.