హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాహుల్ గాంధీపై కేసు నమోదును ఖండించిన కాంగ్రెస్

ATP: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై అక్రమంగా కేసు నమోదు చేయడాన్ని అనంతపురం నగర కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ ఇమామ్ వలి ఆధ్వర్యంలో నాయకులు నల్ల రిబ్బన్లు ధరించి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. కేంద్రంలోని అధికార పార్టీ రాజకీయ కక్షసాధింపుతో రాహుల్ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఇమామ్ వలి మండిపడ్డారు.