హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆసుపత్రి భవనం.. సేవలకు సిద్ధం..!

NGKL: కొల్లాపూర్ సమీపంలోని రామాపురం గుట్ట ప్రాంతంలో రూ.20 కోట్లతో ప్రాంతీయ ఆసుపత్రి భవన నిర్మాణం పూర్తి చేశారు. రూ. 12 కోట్లతో భవనం నిర్మాణం జరిగిందని, రూ.8 కోట్లతో ఆసుపత్రిలో సామగ్రి ఏర్పాటుకు కేటా యించినట్లు ఇంజినీరింగ్ విభాగం ఏఈ బాల్ రాజు మంగళవారం తెలిపారు. నూతన భవన నిర్మాణంతో మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి.