హైదరాబాద్: 28°C
తెలంగాణ

నెల్కి వెంకటాపూర్‌లో మహిళ దారుణ హత్య

MNCL: దండేపల్లి మండలం, నెల్కి వెంకటాపూర్‌లో సింగతి లక్ష్మీ అనే మహిళ మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురైనట్లు స్థానికులు వెల్లడించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. లక్ష్మి హత్యకు గల కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై దండేపల్లి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.