KMR: సదాశివనగర్‌లోని ధర్మారావుపేట మండల ప్రాథమిక పాఠశాల వినూత్న రూపుతో ఆకట్టుకుంటోంది. ఏడేళ్ల క్రితం విద్యార్థుల సంఖ్య పెంచేందుకు గ్రామస్థులు, దాతల సహకారంతో ఉపాధ్యాయులు తరగతి గదులను రైలుబండి ఆకారంలో తీర్చిదిద్దారు. రంగురంగుల ఆవరణ, ఆకర్షణీయమైన తరగతి గదులతో పాఠశాల కళకళలాడుతోంది. దీంతో విద్యార్థుల సంఖ్య పెరిగి, గ్రామంలో అక్షరాస్యత పెంపునకు పాఠశాల దోహదపడుతోంది.
తెలంగాణ
రైలుబండి కాదు.. ఇది ఒక పాఠశాలే!


