హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు మండలంలో చేపల చెరువుకు వేలం

CTR: వెదురుకుప్పం మండలంలోని ఆళ్లమడుగు గ్రామ సచివాలయ పరిధిలోని బుచ్చిరెడ్డి కండ్రిగ చెరువులో చేపల పెంపకం కోసం గురువారం ఉదయం 11 గంటలకు వేలం వేయనున్నట్లు ఎంపీడీవో పురుషోత్తం తెలిపారు. బహిరంగ వేలంలో పాల్గొనే వారు రూ. 15 వేలు డిపాజిట్ చెల్లించాలని సూచించారు. ఇతర వివరాలకు ఆళ్లమడుగు సచివాలయాన్ని సంప్రదించాలని కోరారు.