హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఉపాధ్యాయ వృత్తి అత్యంత పవిత్రమైనది'

అన్నమయ్య: సంబేపల్లి మండలం మోటకట్ల హైస్కూల్‌లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత యండపల్లి నాగ శేషారెడ్డిని ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలని ఉప విద్యాశాఖాధికారి నాగయ్య అన్నారు. అంకితభావం, నిబద్ధతతో పనిచేస్తే గౌరవం, గుర్తింపు లభిస్తాయని పేర్కొన్నారు. మారుతున్న విద్యా విధానాలకు అనుగుణంగా బోధనా నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలన్నారు.