హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గంజాయి నిందితుడిపై 'PIT-NDPS' నమోదు

GNTR: గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న మల్లవారపు పృధ్వీపై PIT-NDPS చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు జిల్లా జైలు నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించారు. అతనిపై మూడు గంజాయి కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 11 మందిపై PIT-NDPS చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.