హైదరాబాద్: 28°C
తెలంగాణ

అదుపుతప్పిన బైక్.. వ్యక్తికి తీవ్రగాయాలు

నిజామాబాద్‌ నుంచి డిచ్‌పల్లి వైపు వెళ్తుండగా మాధవనగర్‌ బ్రిడ్జి దాటిన తర్వాత ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో వాహనదారుడికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.