NGKL: తెలకపల్లి మండల కేంద్రంలోని 1వ వార్డులో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేక విషపురుగులు సంచరిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళ వారం ప్రభుత్వ ఆస్పత్రి ఎదురుగా ఉన్న కాలనీలో ఓ ఇంట్లోకి పాము చొరబడి కోళ్లను చంపింది. దీంతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి పరిసరాలను శుభ్రం చేయాలని కోరారు.
తెలంగాణ
తెలకపల్లిలో పాము సంచారంతో భయాందోళన


