హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొడవటూరులో 87 మందిపై బైండోవర్

JN: బచ్చన్నపేట మండలం కొడవటూరులో గొర్రెలు, మేకల షెడ్ల ఏర్పాటుపై కుర్మకులస్తులకు చెందిన రెండు వర్గాల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న వివాదంపై పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరిగి శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉండటంతో 87 మందిని మంగళవారం ఎంఆర్‌వో సమక్షంలో బైండోవర్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.