ADB: పట్టణానికి చెందిన శాంతాబాయి తన కూతురు ఊర్మిలాబాయికి ఆర్ఆర్ నగర్‌లో 7 ప్లాట్లను గిఫ్ట్ డీడ్ చేసి ఇచ్చిందని వన్ టౌన్ CI సునీల్ కుమార్ తెలిపారు. ఆ ప్లాట్లను మోసపూరితంగా జయప్రకాశ్ జైస్వాల్ జీపీఏ చేసుకొని ఇతరులకు విక్రయించాడని అన్నారు. బాధితురాలి ఫిర్యాదుతో మోసానికి పాల్పడిన నిందితుడిని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు CI వెల్లడించారు.
తెలంగాణ
ప్లాట్ల మోసం కేసులో నిందితుడు అరెస్ట్


