SRPT: గ్రామీణ కూలీలకు నిరంతరం ఉపాధి కల్పిస్తూ రోజువారీ వేతనం కనీసం రూ.300 అందేలా చూడాలని, సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి పనులపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన సంబంధిత శాఖ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ
తుంగతుర్తి అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష


