హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రేమ పేరుతో వేధింపులు.. మూడేళ్ల జైలు

KDP: ప్రేమ పేరుతో యువతిని వేధించి, బెదిరింపులకు పాల్పడిన కేసులో ప్రొద్దుటూరు మండలం చౌడూరుకు చెందిన పళ్లపోతుల అనిల్‌కుమార్‌కు మూడేళ్ల సాధారణ జైలు, రూ. 5,500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి సురేంద్రరెడ్డి మంగళవారం తీర్పు ఇచ్చారు. ఉద్యోగం ఇప్పిస్తానని పరిచయమైన యువతిని ప్రేమ పేరుతో వేధిస్తూ, విషయం తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానని బెదిరించినట్లు కేసు నమోదైంది.