హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేశ్ ఉత్సవాలపై నేడు శాంతి కమిటీ భేటీ

MDK: రామాయంపేటలోని కళ్యాణ శుభ వేదికలో నేడు ఉదయం 10 గంటలకు శాంతి కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు సీఐ సైదా తెలిపారు. చేగుంట, నార్సింగి, చిన్న శంకరంపేట, రామాయంపేట, నిజాంపేట మండల పరిధుల గణేష్ మండపాల నిర్వాహకులు, యువజన సంఘాల నాయకులు హాజరుకావాలన్నారు. ఉత్సవాల నిర్వహణ, భద్రతపై పలు ముఖ్యమైన సూచనలు చేయనున్నట్లు పేర్కొన్నారు.