హైదరాబాద్: 28°C
తెలంగాణ

సహకార సంఘాలతో విత్తనోత్పత్తి: నగేష్

సంగారెడ్డి జిల్లాలోని సహకార సంఘాల (పీఏసీఎస్) ద్వారా విత్తనోత్పత్తిని లాభదాయక వ్యాపారంగా మలచాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ సంచాలకులు నగేష్ అన్నారు. సిద్దిపేటలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టు అమలు, వ్యాపార అవకాశాలపై స్పష్టతనిచ్చారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేలా సంఘాలు కృషి చేయాలని సూచించారు.