హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు కాకుమానులో మెగా వైద్య శిబిరం

GNTR: ఈ నెల 10న ఉదయం 9 గంటలకు కాకుమానులో మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, కాటూరి వైద్య కళాశాల సౌజన్యంతో శిబిరం జరుగుతుంది. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు శిబిరాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాన్ని బీకే పాలెం రహదారిలోని కారుమంచి ప్రసాద్ కంపెనీ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు పేర్కొన్నారు.