సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పరిధిలోని సిద్ధాపూర్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంటి ముంగిట ఆడుకుంటున్న పసివాడిని ప్రైవేటు స్కూల్ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ఘోరానికి కారణమని స్థానికులు మండిపడుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
తెలంగాణ


