MLG: అక్షరాస్యతతోనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని మెప్మా పీడీ రవీందర్ అన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ములుగు పట్టణంలోని మెప్మా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహిళలు చదవడం, రాయడం నేర్చుకుని అందరికీ ఆదర్శంగా నిలవాలని సూచించారు. కార్యక్రమంలో వేణు, కమిషనర్ సంపత్, మహిళాసమాఖ్యల ప్రతినిధులు పాల్గొన్నారు
తెలంగాణ
అక్షరాస్యతతోనే మహిళా సాధికారత


