హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాలువలో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

NTR: విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో మద్యం మత్తులో చిన్న కాలువ దాటే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. బార్ బయట నిద్రించిన అతను ఉదయం వర్షం కురవడంతో లేచి కాలువలో పడ్డాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి పడమట ఎస్సై భరత్ దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.