NRPT: ఊట్కూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు టిప్పర్లను టాస్క్‌ఫోర్స్, పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. నారాయణపేట రోడ్డుపై, చెక్‌పోస్ట్ వద్ద ఒక్కో టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్లు పి.నరేందర్, డి.హనుమంతుతో పాటు పి.అజయ్, డి.రాజుపై కేసులు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్ తెలిపారు.
తెలంగాణ
అక్రమ ఇసుక తరలిస్తున్న టిప్పర్లు పట్టివేత


