హైదరాబాద్: 28°C
తెలంగాణ

డీ-అడిక్షన్ కేంద్రాలకు దరఖాస్తులు: కలెక్టర్

నారాయణపేట జిల్లాలో NAPDDR పథకం కింద డీ-అడిక్షన్ కేంద్రాల ఏర్పాటుకు అర్హత కలిగిన స్వచ్ఛంద సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌ ప్రియాంక తెలిపారు. సంబంధిత రంగంలో రెండేళ్ల అనుభవం ఉన్న సంస్థలు అర్హులన్నారు. అవసరమైన పత్రాలతో e-Anudaan పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హ సంస్థలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.