హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో నేడు మెగా జాబ్‌ మేళా

WNP: నిరుద్యోగ యువతకు ప్రైవేట్ ఉద్యోగాల కోసం ఇవాళ ఉదయం 11 గంటలకు వనపర్తి భగీరథ కాలనీలోని లిటిల్ విల్లే పాఠశాలలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి చరణ్‌దీప్ తెలిపారు. మెడిప్లస్, అపోలో, శ్రీ విజయ బయో ఫర్టిలైజర్స్ కంపెనీలు పాల్గొంటాయన్నారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన 18–35 ఏళ్ల వారు అర్హులని తెలిపారు.