హైదరాబాద్: 28°C
వార్తలు

J&K ఎల్జీగా సక్సేనాకు అదనపు బాధ్యతలు

జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ ఎల్జీగా ఉన్న మనోజ్ సిన్హా సెలవులో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వినయ్ కుమార్ సక్సేనాకు అదనపు బాధ్యతలను రాష్ట్రపతి ద్రౌపదిముర్ము అప్పగించారు. మనోజ్ సిన్హా సెలవులో ఉన్నంతకాలం సక్సేనా J&K ఎల్జీగా విధులు నిర్వర్తించనున్నారు.