హైదరాబాద్: 28°C
వార్తలు

INSPIRATION: నిర్మలా దేశ్ పాండే

ప్రముఖ గాంధేయవాది, సామాజిక కార్యకర్త, రాజ్యసభ మాజీ సభ్యురాలు నిర్మలా దేశ్‌పాండే. 'భూదాన్ ఉద్యమం'లో దేశవ్యాప్తంగా వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అహింస, శాంతి, సర్వోదయ ఆశయాల ప్రచారానికి తన జీవితాన్ని అంకితం చేశారు. భారత ప్రభుత్వం 2006లో ద్వితీయ అత్యున్నత పౌర పురస్కారమైన 'పద్మవిభూషణ్'తో సత్కరించింది. పంజాబ్, కశ్మీర్‌లో శాంతి నెలకొల్పడానికి ఆమె ఎంతగానో శ్రమించారు.