హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు కరీంనగర్‌లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

కరీంనగర్‌లో విద్యుత్ మరమ్మతుల వల్ల ఇవాళ పలు ప్రాంతాల్లో కరెంట్ నిలిపివేస్తున్నట్లు టౌన్-2 ADE లావణ్య తెలిపారు. లేక్ పోలీస్ స్టేషన్, సాయిబాబా, అంజనాద్రి టెంపుల్స్, శ్రీనగర్, సప్తగిరి తదితర ఏరియాల్లో ఉ.9-12 గంటల వరకు, మంకమ్మతోట, రాంనగర్, రాజీవ్ నగర్, పద్మానగర్, ప్రగతినగర్ ఏరియాల్లో ఉ.9.30 నుంచి మ.12 వరకు కరెంట్ ఉండదన్నారు. ఈ మేరకు వినియోగదారులు సహకరించాలని కోరారు.